![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1062 లో.....వెంకీ కాలికి ఉన్న బొబ్బలు చూసి లక్ష్మి వెన్న రాస్తుంది. మరొకవైపు లక్కీ, రాజు సిట్టింగ్ వేస్తారు. ఒరేయ్ నీ లైఫ్ అంత సాఫీగా జరుగుతుందన్న టైమ్ లో ఈ ట్విస్ట్ ఏంట్రా.. అసలు కిడ్నాప్ చేసిన అమ్మాయిని పెళ్లి ఎందుకు చేసుకున్నావని లక్కీ అడుగుతాడు. పెళ్లి లేదు.. ఏం లేదురా.. అంతా నాటకమని రాజు అనగానే లక్కీ షాక్ అవుతాడు. వాళ్ళు మాట్లాడుతుంది మొత్తం ఐశ్వర్య ఫోన్ లో వీడియో తీస్తుంది.
అసలు ఏం మాట్లాడుతున్నావ్ రా అని లక్కీ అనగానే ఇందుకి పెళ్లి ఇష్టం లేదు అందుకే నన్ను అద్దె మొగుడిగా నటించమని చెప్పిందని రాజు అంటాడు. నువ్వు గ్రేట్ రా ఇలా కూడా డబ్బు సంపాదిస్తున్నావని లక్కీ అంటాడు. దాంతో ఐశ్వర్యకి లక్కీ సైగ చేస్తాడు. ఒకే అని ఐశ్వర్య అంటుంది. ఒసేయ్ ఇందు ఇన్నిరోజులు ఎంత మోసం చేసావే.. మీ సంగతి పార్టీలో చెప్తానని ఐశ్వర్య అనుకుంటుంది. ఆ తర్వాత వెంకీ ఫుడ్ డెలివరీ చెయ్యడానికి వెళ్తుంటే బాక్స్ తీసుకొని వెళ్ళరా అని లక్ష్మి అంటుంది. దాంతో వెంకీ బాక్స్ తీసుకొని కంగారుగా వెళ్తాడు. చిన్నోడు ఇంటి కోసం చాలా కష్టపడుతున్నాడు పాపం అని చలపతి, లక్ష్మీ అనుకుంటారు. పెద్దోడు ఉన్నాడు ఇంతకి పట్టించుకోడు.. ఒకసారి ఫోన్ చేద్దామని చలపతి ఫోన్ చేస్తాడు. చలపతి ఫోన్ చేస్తుంటే రాజు కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తున్నావ్ మాట్లాడొచ్చు కదా అని ఇందు అంటుంది. నీకు వాళ్ళ గురించి తెలియదులే అని రాజు అంటాడు.
మరొకవైపు వెంకి ఫుడ్ డెలివరీ చేసి అలసిపోతాడు. తనకి తినడానికి కూడా టైమ్ ఉండదు. తీరా తిందామనే టైమ్ కి ఫుడ్ పాడవుతుంది. దాంతో మంచి నీళ్లతో కడుపునింపుకుంటాడు. అప్పుడే నందు వస్తుంది. పాపం నా వల్లే ఈ జాబ్ చేస్తున్నావ్ అంటుంది. నిజానికి నీకు థాంక్స్ చెప్పాలని వెంకీ అంటాడు. తరువాయి భాగంలో ఇందు సీఈఓ అయినందుకు రేఖ పార్టీ ఇస్తుంది. ఆ పార్టీకీ చలపతి, లక్ష్మి వస్తారు. వాళ్ళని అపర్ణ చూసి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మీ అబ్బాయిని పిలుస్తానని చెప్పి రాజుకి మీ పేరెంట్స్ వచ్చారని చెప్తుంది. దాంతో రాజు వాళ్ళని పక్కకి తీసుకొని వెళ్తాడు. ఒరేయ్ నీకు నిజం తెలిసిపోయిందా అని లక్ష్మీ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |